News June 5, 2024
కర్నూలు: తల్లి సర్పంచ్.. కొడుకు ఎమ్మెల్యే
గతంలో తల్లి సర్పంచ్ కావడంతో రాజకీయాల్లోకి వచ్చిన బొగ్గుల దస్తగిరి కోడుమూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోడుమూరు ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ తరఫున 1985లో ఎం.శిఖామణి, 2014, 2019లో వైసీపీ గెలవగా.. ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరఫున బొగ్గుల దస్తగిరి విజయం సాధించారు.
Similar News
News November 8, 2024
క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలి: డీఎంహెచ్‌వో
ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలని ఎంహెచ్‌వో డాక్టర్ భాస్కర్ అన్నారు. గురువారం కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుండి కలెక్టరేట్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎంహెచ్‌వో జెండా ఊపి ప్రారంభించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికి వారి ఇంటి వద్దే బ్రెస్ట్, ఓరల్, సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తామన్నారు.
News November 7, 2024
భార్యను చంపిన కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
దొర్నిపాడు మండలం డబ్ల్యూ.గోవిందిన్నెకు చెందిన చిలంకూరు పుల్లయ్యకు గురువారం ఆళ్లగడ్డ 5వ అదనపు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. 2022 ఏప్రిల్ 8న ముద్దాయి తన భార్య వేరే వ్యక్తితో చనువుగా ఉందన్న అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు. అప్పటి కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి ముద్దాయిపై ఛార్జిషీట్ దాఖలు చేసి సాక్షాధారాలతో నిరూపించారు.
News November 7, 2024
కర్నూలు: AHAల ఫలితాల విడుదల
ఏపీ వ్యాప్తంగా పశుసంవర్ధక సహాయకులకు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ(SVVU) ఆధ్వర్యంలో ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం సెప్టెంబర్ 15న నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. నంద్యాల జిల్లాలో 125 మంది, కర్నూలు జిల్లాలో 120 మంది AHAలు తాజా ఫలితాల్లో అర్హత సాధించారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్హత సాధించిన 245 మంది AHAలకు 2026 మార్చి 1న ప్రొబేషన్ డిక్లేర్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.