News October 24, 2024

కర్నూలు: త్వరలో పెళ్లి.. అంతలోనే విషాదం

image

పెద్దకడబూరు మండలం ఓంనగర్ సమీపంలో ఆదోని-మాధవరం రహదారిపై ఆటో బోల్తా పడి మంత్రాలయానికి చెందిన ముల్లా ఖాజా హుస్సేన్(50) మృతి చెందినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మృతుని కుమారుడి వివాహం నిమిత్తం ఆదోనిలో షాపింగ్ చేసుకొని తిరిగి ఆటోలో మంత్రాలయానికి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బోల్తా పడిందన్నారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

Similar News

News November 3, 2024

మంత్రాలయంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య

image

మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల వాహనాలతో పోలీసులకు తల నొప్పిగా మారింది. సెలవు రోజులు వచ్చాయంటే భక్తుల సంఖ్యతో వాహనాల రద్దీ పెరిగి పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే తమ వాహనాలను నిలిపేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. శనివారం కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో సీఐ రామాంజులు తమ సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు.

News November 2, 2024

గండ్లేరు రిజర్వాయర్‌లో మృతదేహం లభ్యం

image

నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న గండ్లేరు రిజర్వాయర్‌లో ఆదయ్య(78) మృతదేహం లభ్యమైనట్లు ఏఎస్ఐ భూపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా ఎర్రగుంట్లకు చెందిన ఆదయ్యగా గుర్తించామన్నారు. ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడ్డాడని, మృతుని కుమారుడు వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

News November 2, 2024

చెంచుల జీవన ప్రమాణాల పెంపునకు సర్వే నిర్వహించండి: కలెక్టర్

image

నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని చెంచు గూడెల్లో మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు సర్వే నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. జిల్లాలో 14 మండలాల్లోని 48 చెంచుగూడెల్లో 2,095 కుటుంబాల్లో దాదాపు 8,000 మంది చెంచులు జీవనం సాగిస్తున్నారన్నారు.