News August 9, 2024
కర్నూలు, నంద్యాలలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేది వీరే..
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. కర్నూలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో పంద్రాగస్టు నాడు మంత్రి టీజీ భరత్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించనున్నారు. నంద్యాలలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆవిష్కరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News September 18, 2024
ట్రైనీ ఐపీఎస్‌గా నంద్యాల జిల్లా యువ ఐపీఎస్ మనీషా రెడ్డి
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఏపీకి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది. నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లెకు చెందిన వంగల మనీషా రెడ్డి ఆ జాబితాలో ఉన్నారు. సొంత రాష్ట్రానికి ట్రైనీ ఐపీఎస్‌గా కేటాయించడంతో నందిపల్లి గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
News September 18, 2024
నంద్యాల: కాలువలో పడి బాలుడి మృతి
శిరివెళ్లలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కాశిరెడ్డి నాయన దేవాలయం సమీపంలోని కాలువలో పడి శంకరయ్య(13) అనే బాలుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన గురుమూర్తి, సుంకమ్మ కుమారుడు శంకరయ్య నిన్నటి నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలిస్తుండగా ఆలయం పక్కన ఉన్న కాలువలో మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
News September 18, 2024
కర్నూలు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛత హి సేవ
కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా వ్యాప్తంగా ఊరూరా స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీ.రంజిత్ బాషా బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.