News October 17, 2024
కర్నూలు, నంద్యాల జిల్లాలో సెలవు ఇవ్వాలని డిమాండ్
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని జిల్లా వాసులను చల్లటి గాలులు పలకరిస్తున్నాయి. మిడుతూరు, మహానంది, ఆళ్లగడ్డ, డోన్ తదితర మండలాల్లో రాత్రి జోరు వర్షం కురిసింది. నేడూ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలపడంతో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులివ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముసురు వాతావరణంతో బయటకు వచ్చే పరిస్థితిలేదని సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.
Similar News
News November 7, 2024
కర్నూలులో ఉల్లి ధర పైపైకి..
ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రెండ్రోజుల నుంచి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో నిన్న క్వింటా గరిష్ఠంగా రూ.4,849 పలికింది. సరాసరి ధర రూ.3,896తో విక్రయాలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి దిగుబడిని రైతులు కర్నూలు మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో తీసుకొస్తున్నారు. కిలోకు సుమారు రూ.40కిపైగా ధర దక్కుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 7, 2024
‘వెలివేయాలని చూస్తున్నారు.. పోలీసులే న్యాయం చేయాలి’
ఎరుకలు కులస్థులైనందున ఆ ప్రాంతం నుంచి తమను వెలివేయాలని కుట్ర చేస్తున్నారని, పోలీసులు న్యాయం చేయాలని బుధవారం ఎరుకలి రామన్న కుటుంబ సభ్యులు వాపోయారు. ఆదోనిలోని గణేశ్ సర్కిల్ ప్రాంతంలో తాము జీవిస్తున్నామని, సోమవారం ఇంటి పక్కన వారు దాడి చేసి, కులవివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. తమకు ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ న్యాయం చేయాలని కోరారు.
News November 7, 2024
చలి మొదలు..
కర్నూలు జిల్లా వ్యాప్తంగా చలి మొదలైంది. తెల్లవారుజామున పొగ మంచు ఎక్కువగా కురుస్తోంది. ఉదయం వేళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో 22°C, 8 గంటల సమయంలో 25 °C నమోదైంది. మరోవైపు వాహనదారులు లైట్లు వేసుకొని ముందుకు సాగాల్సి వస్తోంది. మరి మీ ఊర్లో వాతావరణం ఎలా ఉంది. కామెంట్ చేయండి..