News November 20, 2024
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పైప్ లైన్ ఏర్పాటు: వపన్ కళ్యాణ్

NTR సుజలస్రవంతి పథకం కింద 6 జిల్లాల్లో ఓ హబ్, స్పోక్ విధానంలో ప్లాంట్లను నెలకొల్పినట్లు అసెంబ్లీలో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా.. కర్నూలు, నంద్యాల, నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళంలో 45 మదర్ ప్లాంట్లను నెలకొల్పారని, అందులో 20 నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొన్నారు. KNL, NDL, చిత్తూరు నుంచి పైప్ లైన్ ఏర్పాటుతో పాటు వాటినీ పునరుద్ధరిస్తామన్నారు.
Similar News
News March 12, 2026
కర్నూలులో 261 మంది ఇంటర్ విద్యార్థుల గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 261 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 4,590 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 4329 మంది మాత్రమే పరీక్ష రాశారని వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
News March 12, 2026
కర్నూలులో 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు!

కర్నూలులోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్‌లో ఉన్న నందనం డిగ్రీ కాలేజీలో ఈనెల 14న ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీల్లో సుమారు 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ చదివినవారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కళాశాల కరెస్పాండెంట్ జనార్ధన్ తెలిపారు.
News March 12, 2026
కర్నూలు: సెలవుల్లేని సేవ.. రోగులకు అండగా సిరాజ్ ఉల్

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ సిరాజ్ ఉల్ 15 ఏళ్లుగా నిరంతరం రోగులకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సెలవులు, ఆదివారాల్లోనూ విధులు నిర్వర్తిస్తూ ఆసుపత్రికి వచ్చే సుమారు 700 మంది రోగులకు మందులు అందిస్తున్నారు. ఆసుపత్రిలో మహిళలు, పురుషులకు ఒకే కౌంటర్ ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రమబద్ధంగా మందులు పంపిణీ చేస్తూ సేవాభావాన్ని చాటుతూ.. అందరి మన్ననలు పొందుతున్నారు.


