News October 20, 2024

కర్నూలు: నకిలీ అధికారుల అరెస్టు

image

కేంద్ర విజిలెన్స్ శాఖ అధికారులమంటూ కర్నూలు జిల్లాలో వసూళ్లకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఓర్వకల్లులోని ఓ వ్యాపారి ఇంటికి ఐదుగురు వెళ్లి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. ఇవ్వకపోవడంతో కర్నూలు DSP బాబుప్రసాద్‌కి ఫోన్ చేశారు. నకిలీ బియ్యం రవాణా చేస్తుంటే మీరు(DSP) ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. డీఎస్పీకి అనుమానం వచ్చి విచారించి రూరల్ CI చంద్రబాబు నాయుడు సాయంతో వారిని అరెస్ట్ చేశారు.

Similar News

News November 13, 2024

కర్నూలు మీదుగా శబరిమలకు స్పెషల్ రైలు

image

అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కర్నూలు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 14, 21, 28 తేదీలలో సాయంత్రం 5:50 నిమిషాలకు కర్నూలు మీదుగా కొట్టాయం వెళుతుంది. తిరిగి ఈ నెల 15, 22, 29 తేదీలలో రాత్రి 8:30 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:00 గంటలకు కర్నూలు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. 

News November 13, 2024

కర్నూలు జిల్లాలో మరో రెండు దారుణాలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో రెండు దారుణాలు వెలుగు చూశాయి. బేతంచెర్ల మండలంలో 2వ తరగతి చిన్నారికి ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి తల్లి ఇంట్లో లేని సమయంలో అత్యాచారం చేయబోయాడు. చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యాడు. గూడూరు మండలంలోని ఓ మహిళ పొలం పనులకు వెళ్లగా గోపాల్ అనే వ్యక్తి అత్యాచారం చేయబోగా తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోస్గి మండలంలో బాలికపై <<14596443>>సర్పంచ్ <<>>ఇలాగే వ్యవహరించిన విషయం తెలిసిందే.

News November 13, 2024

KNL: బాలికపై సర్పంచ్ అత్యాచారయత్నం

image

బాలికపై సర్పంచ్ అత్యాచారయత్నం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. ఆమె తండ్రి వివరాల మేరకు.. కోసిగి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఫ్యామిలీ పత్తి పనులకు కర్ణాటక వెళ్లింది. 8వ తరగతి చదివే కుమార్తె(13)ను తాత వద్ద వదిలి వెళ్లారు. గత నెల 30న ఆమె ఇంటి బయట నిద్రిస్తుండగా ఇద్దరి సహకారంతో స్థానిక సర్పంచ్ అత్యాచారం చేయబోయాడు. అలికిడి విని తాత నిద్రలేవగా వాళ్లు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు.