News June 25, 2024
కర్నూలు: నకిలీ బంగారు గాజులతో బురిడీ

నకిలీ బంగారు గాజులు తాకట్టు పెట్టి రూ.లక్షల రుణం తీసుకునన్న ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఉయ్యాలవాడ మండలం మాయలూరుకు చెందిన లక్ష్మీనారాయణ, పేరుసోములకు చెందిన అమీర్ గతేడాది కోవెలకుంట్లలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో నకిలీ బంగారు తాకట్టు పెట్టి రూ.6.66లక్షలు రుణంగా తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఆడిట్లో ఆ గాజులు నకిలీవని తేలడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు కోవెలకుంట్ల ఎస్సై వరప్రసాద్ తెలిపారు.
Similar News
News October 21, 2025
ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల భాషపై దృష్టి పెట్టండి: కలెక్టర్

ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల భాషపై దృష్టి సారించాలని, అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్‌తో పాటు విద్యాశాఖ అధికారులతో పూర్వ ప్రాథమిక విద్యపై కలెక్టర్ సమీక్ష చేశారు. ప్రాథమిక విద్యలోనే ఆంగ్ల భాష నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు 20 మంది రిసోర్స్ పర్సన్లను నియమించాలన్నారు.
News October 21, 2025
రైతు సంక్షేమంపై దృష్టి సారించండి: కలెక్టర్

వ్యవసాయ సహాయక శాఖల పనితీరు, రైతులకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో అగ్రికల్చర్ అల్లయిడ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ, పశుసంవర్ధక, పాల, మత్స్య, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతులకు సమయానికి విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
News October 21, 2025
పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులు చేయాలి: కలెక్టర్

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీఐఐసీ జడ్ఎంను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ప్రాజెక్టులు, భూ సేకరణ అంశాలపై ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్షించారు. 3 కిలోమీటర్ల మేర భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.