News March 18, 2024

కర్నూలు నుంచి జేఎస్ఎస్‌పీ అభ్యర్థిగా రామయ్య యాదవ్ పోటీ

image

జాతీయ సమ సమాజం పార్టీ నుంచి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏపీ రామయ్య యాదవ్ తెలిపారు. సమాజ హితం కోసం సమసమాజ స్థాపనకై తమ పార్టీ ఆవిర్భవించిందని స్పష్టంచేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు ప్రజల తాగునీటి సమస్యను తీర్చి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కర్నూలును అభివృద్ధి చేస్తానన్నారు.

Similar News

News September 19, 2024

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా జయలక్ష్మి

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా ఆర్.జయలక్ష్మిని నియమిస్తూ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జయలక్ష్మి అనంతపురం మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత కార్యదర్శి గోవిందును అనంతపురం బదిలీ చేశారు.

News September 18, 2024

ట్రైనీ ఐపీఎస్‌గా నంద్యాల జిల్లా యువ ఐపీఎస్ మనీషా రెడ్డి

image

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఏపీకి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది. నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లెకు చెందిన వంగల మనీషా రెడ్డి ఆ జాబితాలో ఉన్నారు. సొంత రాష్ట్రానికి ట్రైనీ ఐపీఎస్‌గా కేటాయించడంతో నందిపల్లి గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

News September 18, 2024

నంద్యాల: కాలువలో పడి బాలుడి మృతి

image

శిరివెళ్లలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కాశిరెడ్డి నాయన దేవాలయం సమీపంలోని కాలువలో పడి శంకరయ్య(13) అనే బాలుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన గురుమూర్తి, సుంకమ్మ కుమారుడు శంకరయ్య నిన్నటి నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలిస్తుండగా ఆలయం పక్కన ఉన్న కాలువలో మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.