News March 20, 2024
కర్నూలు: ‘పకడ్బందీగా ఎన్నికల నిబంధనల అమలు’
ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిబంధనలు పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఆయన మంగళవారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాలు, వాణిజ్య స్థలాల్లో ఎలాంటి రాజకీయ ప్రకటనల హోర్డింగ్లు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని సూచించారు. ఈ కాన్ఫరెన్స్ కలెక్టర్ సృజన పాల్గొన్నారు.
Similar News
News September 8, 2024
డోన్: చవితి వేడుకల్లో అపశ్రుతి..యువకుడి మృతి
డోన్ పట్టణంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామా నగర్‌కు చెందిన కమ్మరి కౌశిక్ శనివారం రాత్రి గణేశ్ మండపానికి ప్లాస్టిక్ కవర్ కప్పబోయి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తోటి వారు డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మరణించినట్లు తెలిపారు. దీంతో పండగ పూట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News September 8, 2024
ప్రతి రైతును ఆదుకుంటాం: మంత్రి బీసీ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సంజామల పాలేరు వాగు పరివాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి శనివారం పరిశీలించారు. రైతులు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. పంట నష్టపరిహారంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
News September 8, 2024
గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ దంపతులు
వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎంపీ నాగరాజు కోరారు. కర్నూలు రూరల్ మండలం పంచలింగాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి ఎంపీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గణేష్ మండపాలతో కళకళలాడాల్సిన సమయంలో విజయవాడలో కురిసిన భారీ వర్షాలు, వరదలు అక్కడి ప్రజలను తీవ్ర కష్టాలపాలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.