News April 13, 2025
కర్నూలు: పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం రద్దు

డా.బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావొద్దని తెలిపారు. జిల్లా ప్రజలు విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News April 19, 2025
కర్నూలు: సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే రక్షణ

సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. ప్రజలు వారి విలువైన సమాచారం నష్టపోడానికి, మోసపోవడానికి ప్రధానంగా అత్యాశ, అశ్రద్ధ కారణాలని సూచించారు. మోసానికి గురైనవారు వెంటనే 1930కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. అలాగే www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అప్రమత్తతే రక్షణని ఆయన హెచ్చరించారు.
News April 19, 2025
శ్రీనగర్ ASPగా కర్నూల్ వాసి.!

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ ASPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ ASPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
News April 18, 2025
మల్లన్న సేవలో సంగీత దర్శకుడు మణిశర్మ

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సినీ సంగీత దర్శకుడు మణిశర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. సమరసింహారెడ్డి, అన్నయ్య, ఖుషి, ఆది, ఇంద్ర, అతడు, నారప్ప, ఆచార్య వంటి ఎన్నో చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించారు.