News March 28, 2024
కర్నూలు: పల్లె లక్ష్మన్న శవం ఆచూకీ లభ్యం

దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామానికి చెందిన లక్ష్మన్న మృతదేహాం ఇవాళ లభ్యమైంది. అనంతపురం జిల్లా పామిడి బైపాస్ రోడ్‌లో బ్రిడ్జి కింద ముళ్లపొదలలో అతడి తల, మొండెం వేరుగా పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ శ్రీనివాసులు తెలిపారు. అనుమానితులుగా మృతుడి భార్య, కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 40 రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది.
Similar News
News November 8, 2025
ఆదోని: ఈతకెళ్లి బాలుడి మృతి

ఆదోని పరిధిలోని బసాపురంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గౌరమ్మ పండుగ సందర్భంగా పుట్టింటికి వచ్చిన బిచ్చల ఈరన్న కూతురు వరమ్మ కుమారుడు కాలువలో శవంగా తేలాడు. శుక్రవారం పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగారు. ఐతే బాలుడు ఒంటరిగా ఈత ఆడుకుంటూ కాలువలో కొట్టుకుపోయాడు. శనివారం హనువాళ్లు గ్రామంలో మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 8, 2025
పెద్దకడబూరులో హోరాహోరీగా పొట్టేళ్ల పందేలు

పెద్దకడబూరులో శ్రీ భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకుని కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం పొట్టేళ్ల పందాలను టీడీపీ నేతలు రమాకాంతరెడ్డి, మల్లికార్జున ప్రారంభించారు. గ్రామీణ క్రీడలలో భాగమే పొట్టేళ్ల పందేలని గుర్తు చేశారు. ఇందులో గెలుపొందిన పొట్టేళ్లకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నల్ల, నట్టు పొట్టేళ్లకు వేరు వేరుగా పోటీలు నిర్వహించారు.
News November 8, 2025
భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

2018 నవంబర్ 18న భార్య లక్ష్మీ దేవిని గొంతు నులిమి చంపిన కేసులో కర్నూలు శివప్ప నగర్‌కు చెందిన ముద్దాయి శ్రీనివాసులుకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. ముద్దాయి 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా ఉన్నాడు. 2007లో లక్ష్మీదేవిని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీనివాసులు అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


