News July 27, 2024

కర్నూలు: పింఛన్ల పంపిణీకి రూ.196.42 కోట్లు మంజూరు

image

ఎన్టీఆర్ పెన్షన్ కానుక కింద ఆగస్టు నెలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 4,63,200 పింఛన్లకు రూ.196.42 కోట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 4,69,716 పింఛన్లు ఉండగా.. ఆగస్టు నెలకు వచ్చేసరికి 6,916 పింఛన్లపై కోత పడింది. కర్నూలు జిల్లాలో 2,43,337 పింఛన్లకు సంబంధించి రూ.103.54 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,19,863 పింఛన్లకు సంబంధించి రూ.92.88 కోట్లు మంజూరయ్యాయి.

Similar News

News October 12, 2024

కర్రల సమరానికి సిద్ధమైన ‘దేవరగట్టు’

image

హోళగుంద మండల పరిధిలోని దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కర్రల సమరం వీక్షించేందుకు పల్లెజనం ఇప్పటికే భారీగా దేవరగట్టు చేరుకున్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా బన్నీ ఉత్సవాలకు ఎస్పీ బిందు మాధవ్ 800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 నైట్‌ విజన్‌ సీసీ కెమెరాలు, 5 డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఉంచారు.

News October 12, 2024

కర్నూలు జిల్లాలో కిలో టమాటా @రూ.20

image

కర్నూలు జిల్లాలో ఇటీవల రూ.100 పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. పత్తికొండ మార్కెట్‌లో శనివారం కిలో టమాటా ధర రూ.20కి పడిపోయింది. కాగా ఇటీవల టమాట ధరలు పెరగడంతో ప్రభుత్వం సబ్సిడి కేంద్రాల్లో తక్కవ ధరలకే టమాటాలను విక్రయించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 12, 2024

కర్నూలు జిల్లాలో మద్యం షాపులకు 5,128 దరఖాస్తులు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులకు దరఖాస్తు గడువు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,128 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు 3,013 దరఖాస్తులు రాగా, నంద్యాల జిల్లాలో 105 దుకాణాలకు 2,115 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 14న కర్నూలు జడ్పీ సమావేశ హాల్‌లో లక్కీ డిప్ తీయనున్నారు.