News April 3, 2025
కర్నూలు: పిడుగు పాటుతో బాలుడి మృతి

కర్నూలు జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు మండలం కందనాతిలో రవి(15) పొలం పనులు చేస్తున్నాడు. మెరుపులతో బాలుడి సమీపంలో పిడుగు పడింది. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు పొలంలో పనిచేస్తున్న పలువురికి గాయాలు కాగా వారిని వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Similar News
News April 18, 2025
కర్ణాటకలో ప్రమాదం.. నలుగురు హిందూపురం వాసుల మృతి

హిందూపురానికి చెందిన నలుగురు వ్యక్తులు కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హిందూపురం నుంచి కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా షహర్‌పూర్ వెళ్తుండగా బొలెరో- ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు నాగరాజు, సోము, నాగభూషణ్, మురళిగా గుర్తించామన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 18, 2025
పెద్దపల్లికి చేరుకున్న నాగస్వాముల బృందం

మధురై నుంచి రామేశ్వరం వెళ్తున్న నాగస్వాముల బృందం శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా హైవే వద్దకు చేరుకుంది. లోక కళ్యాణం కోసం మధురై నుంచి రామేశ్వరం వరకు ప్రయాణం చేస్తున్నట్లుగా నాగస్వాములు పేర్కొన్నారు. 15 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రయాణంలో అనేక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నామని అన్నారు.
News April 18, 2025
నెల్లూరు: ప్రజలకు ఈకేవైసీ కష్టాలు

రేషన్ కార్డుదారులకు మరోసారి ఈకేవైసీ కష్టాలు వచ్చాయి. గతంలో ఈకేవైసీని వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. సరిగా వేలిముద్రలు పడని వారివి ప్రస్తుతం పెండింగ్ చూపిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీలోనూ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పిల్లలు, పెద్దలకు ఈకేవైసీ పూర్తిచేయాలని భావించింది. పొదలకూరు మండలంలోనే 6,125 మందికి ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లు సివిల్ సఫ్లై డీటీ రవికుమార్ తెలిపారు.