News December 15, 2024

కర్నూలు: పుట్టినరోజు నాడు తీవ్ర విషాదం

image

రాజంపేటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. కోవెలకుంట్లకు చెందిన కిరణ్ రాజంపేట ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. శనివారం కిరణ్‌ పుట్టినరోజు కావడంతో పులివెందులకు చెందిన ఫ్రెండ్ బన్నీ చెన్నైలో చదువుతూ రాజంపేటకు వచ్చారు. కాగా వీరి ఇరువురినీ ఆర్టీసీ బస్సు ఢీకొని పుట్టినరోజు నాడే మృతి చెందగా.. అదే చివరి రోజైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 22, 2026

కర్నూలులో బాక్సింగ్ రింగ్ సిద్ధం!

image

కర్నూలులో ఆదివారం జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (DSDO) భూపతి రావు ప్రారంభించారు. బాక్సింగ్ వంటి వ్యక్తిగత క్రీడల్లో ప్రతిభ చాటితే విద్యా, ఉద్యోగ రంగాల్లో గొప్ప అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. క్రీడలు విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని DSDO అన్నారు.

News February 22, 2026

కర్నూలు: ”సీమను’ ఎడారిని చేసేందుకు చంద్రబాబు కుట్ర’

image

రాయలసీమలోని ఎత్తిపోతల పథకాలను నిలిపివేసి, ప్రాంతాన్ని ఎడారిగా మార్చాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మాట్లాడారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తిరుమల వివాదం వల్ల వెంకన్న శాపంతో హెరిటేజ్ సంస్థకు రూ.2,770 కోట్ల నష్టం వాటిల్లిందని, షేర్ల విలువ భారీగా పడిపోయిందని ఆయన విమర్శించారు.

News February 22, 2026

ఆ లింకులు నమ్మకండి.. ఎస్పీ హెచ్చరిక!

image

ఎనిమిదో వేతన సంఘం నేపథ్యంలో “8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్” పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్ ద్వారా పంపిస్తున్న ఏపీకే(APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని, ఇటువంటి మోసాల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.