News February 25, 2026

కర్నూలు: పునర్వికకు మంత్రి లోకేశ్ రూ.6 కోట్ల సాయం

image

కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక అరుదైన వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. పాప ప్రాణాలు నిలపాల్సిన ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు కాగా, దాతల సాయంతో ఇప్పటికే రూ.10 కోట్లు సమకూరాయి. మిగిలిన రూ.6 కోట్లను తాను ఏర్పాటు చేస్తానని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. చిన్నారి ప్రాణాలు నిలబెట్టేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News April 19, 2026

అనకాపల్లి: రహదారిపై బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..!

image

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారిపై బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2026

గ్రేటర్ జోన్‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్

image

గ్రేటర్ జోన్‌లో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. గత రెండు రోజులుగా అత్యధికంగా 99 నుంచి 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది.