News September 27, 2024
కర్నూలు: పెన్షన్లకు రూ.102.97 కోట్లు
అక్టోబర్ నెలలో కర్నూలు జిల్లాలో పెన్షన్ల పంపిణీకి గాను రూ.102.97 కోట్ల నిధులు విడుదలైనట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ సలీం బాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,41,843 పెన్షన్లకు నగదు మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఎంపీడీవోలు డ్రా చేసుకుని నేరుగా సచివాలయ ఉద్యోగులకు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.
Similar News
News October 15, 2024
కర్నూలు: ఒకే వ్యక్తికి 4 షాపులు దక్కాయి!
ఇటీవల వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా మీడియాలో పాపులరైన ఖమ్మం జిల్లా వాసి కొండపల్లి గణేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఏపీలో జరిగిన మద్యం దుకాణాల కేటాయింపులో లాటరీ ద్వారా ఏకంగా 4 దుకాణాలు దక్కించుకున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు లాటరీ తీయగా పుట్టపర్తిలో-1, నంద్యాలలో 3 షాపులు ఆయనకు దక్కాయి. కాగా ఆయన చవితి వేళ రూ.29 లక్షలు వెచ్చించి వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.
News October 14, 2024
నంద్యాలలో నూతన బస్సులు ప్రారంభించిన ఎంపీ
ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమని, ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని మంత్రి ఫరూక్ అన్నారు. సోమవారం ఆయన నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో నూతన బస్సులను ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు. నంద్యాలకు నూతనంగా ఏర్పాటు చేసిన బస్సులను ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 14, 2024
నంద్యాల: మద్యం దరఖాస్తుల ద్వారా రూ.40.42 కోట్లు ఆదాయం
నంద్యాల జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా, ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు పూర్తయింది. దరఖాస్తుల ద్వారా రూ.40.42కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆమె వెల్లడించారు.