News July 22, 2024
కర్నూలు ప్రజాప్రతినిధులూ వీటిపై దృష్టి పెట్టాలి (1/2)

★ ఆత్మకూరు వద్ద 38.5 కి.మీ మేర అటవీ మార్గం విస్తరణపై దృష్టి పెట్టాలి
★ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తీవ్రంగా సాగు, తాగునీటి సమస్య
★ కొన్ని రహదారుల నిర్మాణాలకు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రతిపాదనలు
★ ఓర్వకల్లులో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు కృష్టి చేయాలి
★ గుండ్రేవుల, ఆర్డీఎస్, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణం
★ కర్నూలులో ఉర్దూ వర్సిటీ నిర్మాణం పూర్తి చేయాలి
★ జిల్లాలోని బస్టాండ్‌ల ఆధునికీకరణ
Similar News
News December 20, 2025
నూతన ఆలోచనలతో అద్భుతాలు సృష్టించాలి: కలెక్టర్

నూతన ఆలోచనలతో విద్యార్థులు అద్భుతాలు సృష్టించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కర్నూలు ప్రభుత్వ టౌన్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలను డీఈవో సుధాకర్, ఏపీసీ లోకరాజుతో కలిసి ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి నమూనాలను రూపొందించాలన్నారు.
News December 20, 2025
క్రిస్మస్, న్యూ ఇయర్.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని SP విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే గిఫ్ట్ కార్డు లింకులతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే 1930, 100, 102కు కాల్ చేయాలన్నారు.
News December 19, 2025
కర్నూలు పోలీసులకు ప్రతిష్ఠాత్మక ABCD అవార్డు

ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ATM దొంగతనం కేసును సమర్థవంతంగా ఛేదించినందుకు కర్నూలు జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయి అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ABCD) లభించింది. మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అవార్డును అందుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను డీజీపీ అభినందించారు.


