News April 13, 2025
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కర్నూలులో నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం రద్దు చేయబడినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా శనివారం ప్రకటించారు. ఈ మేరకు ప్రజలు వారి సమస్యలను తెలియజేసేందుకు కలెక్టరేట్కు రావద్దని సూచించారు. జిల్లాలో ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 16, 2025
కర్నూలు టీడీపీ కార్యాలయంపై దాడి.. నలుగురి అరెస్టు

కర్నూలులోని డీమార్ట్ వెనక ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో నలుగురిని నాల్గో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్ వివరాల ప్రకారం.. టీడీపీ కార్యాలయంపై ప్రభాకర్ నాయుడు, కాశీ, రహంతుల్లా, సలాంఖాన్ దాడికి పాల్పడ్డారు. వేటకొడవళ్లు, కత్తులతో కార్యాలయంలోని శేఖర్ గౌడ్పై దాడికి యత్నించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News April 16, 2025
ఎమ్మిగనూరు విద్యార్థినికి లోకేశ్ సన్మానం

ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్లో 987 మార్కులు సాధించిన యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.
News April 16, 2025
అనుచిత వ్యాఖ్యలు.. గూడూరు యువకుల అరెస్ట్

గూడూరులో పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్ అనే యువకులను కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై గుంటూరులో సైబర్ క్రైం కేసు నమోదైంది. వారి ఆదేశాల మేరకు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.