News April 13, 2025

కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కర్నూలులో నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం రద్దు చేయబడినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా శనివారం ప్రకటించారు. ఈ మేరకు ప్రజలు వారి సమస్యలను తెలియజేసేందుకు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు. జిల్లాలో ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 12, 2026

కర్నూలులో 3.1 కిలోల గంజాయి స్వాధీనం.. 8 మంది అరెస్ట్

image

కర్నూలు టౌన్ బళ్లారి చౌరస్తా సమీపంలోని వీకర్ సెక్షన్ కాలనీలో పోలీసులు దాడి చేసి 3.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఫోర్త్ టౌన్ సీఐ విక్రమ్ సింహ తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు సహా కొనుగోలు, పంపిణీకి వచ్చిన మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితులు అరకు ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2026

ఆదోని వద్ద ఘోర ప్రమాదం (UPDATE)

image

ఆదోని శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరుకు చెందిన ప్రదీప్, అర్పిత, షర్మిల, సిప్రా రాయచూరులో జరిగే వివాహానికి కారులో బయలుదేరారు. ఆదోని పట్టణ శివారు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ప్రమాదంలో సిప్రా మృతిచెందగా, గాయాలైన ముగ్గురినీ ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇస్వీ ఎస్సై మహేశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.