News December 28, 2024

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ఆపరేషన్

image

కడప మహిళకు కర్నూలులో వైద్యులు అరుదైన ఆపరేషన్ పూర్తి చేశారు. కడపకు చెందిన రమణమ్మ గత కొన్నినెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. పరీక్షించిన వైద్యులు కిడ్నీ, లివర్‌కు దగ్గరలో రక్తనాళాలు ఆనుకొని 8.సెం.మీ గడ్డ ఉన్నట్లు గుర్తించారు. ఆమెను కర్నూలుకు రెఫర్ చేయగా.. యురాలజీ HOD డా. కే. సీతారామయ్య బృందంతో మూడు గంటల పాటు శ్రమించి కణితిని తొలగించినట్లు తెలిపారు. ఆమెను శుక్రవారం డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.

Similar News

News January 1, 2025

మొన్నటి వరకు కాసులు.. ఇప్పుడు కన్నీళ్లు!

image

పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. రెండు నెలల కిత్రం సెంచరీ కొట్టిన ధరలు ప్రస్తుతం ₹2 కూడా పలకని పరిస్థితి నెలకొంది. 25కిలోల బాక్సు కేవలం రూ.30కి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. కూలీల ఖర్చులు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 40 నుంచి 50 వేల ఎకరాల్లో టమాటా సాగుచేస్తారు. ప్రధానంగా పత్తికొండ, తుగ్గలి, దేవనకొండ, ఆలూరు తదితర మండలాల్లో ఈ పంట సాగు అధికం.

News January 1, 2025

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News January 1, 2025

వైసీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎస్కే గిరి

image

వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా హొళగుంద మండలానికి చెందిన ఎస్‌కే గిరిని మంగళవారం నియమించారు. ఎస్‌కే గిరి మాట్లాడుతూ.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన వైస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే విరుపాక్షికి రుణపడి ఉంటానన్నారు.