News February 23, 2025
కర్నూలు: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

కర్నూలు జిల్లాలో 30 కేంద్రాలలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. ఉదయం పేపర్-1 పరీక్షలకు 9,993 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 8,693 మంది, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలకు 9,993 మంది హాజరు కావాల్సి ఉండగా 8,678 మంది హాజరయ్యారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.
Similar News
News February 24, 2025
చిత్తూరులో ఏడు మంది అరెస్టు

చిత్తూరు నగరంలోని సంతపేట పాంచాలపురంలో జూదం ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి రూ.7,100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. తేనె బండ శివారులో జూదమాడుతున్న మరో ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 7 మందిని కోర్టుకు హాజరు పరచమన్నారు. జూదం లాంటి చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
News February 24, 2025
NLG జిల్లాలో అంగన్వాడీ పోస్టుల వివరాలు

అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మహిళల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14,236 పోస్టుల భర్తీకి నిర్ణయించింది. NLG జిల్లాలో సుమారు 223 అంగన్వాడీ టీచర్, 63 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ల కొరత కారణంగా ఒక్కొక్కరికి రెండు సెంటర్ల బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయనుండడంతో టీచర్ల కొరత తీరనుంది.
News February 24, 2025
పార్వతీపురం జిల్లాలో 17,849 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు

పార్వతీపురం జిల్లాలో 17,849 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని DVEO మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 1 నుంచి జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 500 మంది ఇన్విజిలేటర్లు, 34 మంది పర్యవేక్షకులు, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌తో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.