News May 19, 2024

కర్నూలు: ప్రేమిస్తున్నానంటూ యువకుడి వీరంగం

image

కర్నూలులోని గీతాముఖర్జీ నగర్‌కు చెందిన పఠాన్ మహ్మద్ షఫీఖాన్‌పై శనివారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‘డిగ్రీ చదువుతున్న నా కూతురిని ప్రేమిస్తున్నానంటూ షఫీఖాన్‌ నిత్యం వేధించేవాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి నా కూతురిని దూషించి, బెదిరించాడు. ఇంటి ముందు ఉన్న బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి వీరంగం సృష్టించాడు’ అంటూ యువతి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 7, 2025

ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది: డీఈవో

image

పదో తరగతి ఫలితాల కోసం ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించి, పాఠాలు పూర్తిగా నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. ప్రతీ పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.

News December 7, 2025

ట్రేడర్లు ఎంఎస్‌పీ కన్నా తక్కువకు కొనరాదు: కలెక్టర్

image

రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా మొక్కజొన్నను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 తగ్గకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి ట్రేడర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తూకాలలో లోపాలు, మోసాలు జరగకుండా పరిశీలనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రవాణా ఛార్జీలు అధికంగా ఉండటం వల్ల కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చర్యలు చేపట్టామన్నారు.