News March 30, 2024

కర్నూలు : బైకు చక్రంలో చున్నీ చుట్టుకుని మహిళ మృతి

image

కర్నూలు జిల్లాకు చెందిన మాధవీలత(25) తెలంగాణలో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు మరికల్ మండలంలో భర్తతో కలిసి గ్యాస్ పొయ్యి మరమ్మతులు చేస్తూ గుడిసెలో జీవించేవారు. అయితే శుక్రవారం కోయిలసాగర్ జలాశయం వద్ద బైకుకు చున్నీ చుట్టుకుని కిందపడడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Similar News

News December 21, 2025

జాతీయ స్థాయి యోగా పోటీలకు జిల్లా క్రీడాకారులు

image

ఈనెల 27 నుంచి 30 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరగబోయే 50వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ & జూనియర్ పోటీలకు జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా సంఘం ఛైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. జిల్లా ఒలింపిక్ సంఘం సీఈఓ విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు సాయి కృష్ణ మాట్లాడారు.

News December 20, 2025

10వ ఫలితాల పెంపునకు 361 పాఠశాలలకు మెంటార్లు: కలెక్టర్

image

పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లాలో 361 పాఠశాలలకు 361 మంది అధికారులను మెంటార్లుగా నియమించినట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను పటిష్ఠంగా అమలు చేసి ఈ ఏడాది 90శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. డ్రాపౌట్ అయిన 1,559 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలలకు తీసుకురావాలన్నారు. హాజరు, రోజువారీ పరీక్షలు, జవాబు పత్రాల పరిశీలనపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలన్నారు.

News December 20, 2025

రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యం: డీఐజీ, ఎస్పీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతీ శనివారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ పరిధుల్లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై సమావేశాలు నిర్వహించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.