News March 6, 2025
కర్నూలు: బొలెరో, బైక్ ఢీ.. వ్యక్తి దుర్మరణం

నందవరం మండలంలోని జోహారాపురం గ్రామ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురువ చదువుల చక్రవర్తి(23) వ్యక్తిగత పనుల మీద బైకుపై వెళ్తుండగా పోలకల్ నుంచి రాయచూర్‌కు కందులు తరలిస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో చక్రవర్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు జయమ్మ, పోసరప్ప కుమారుడిగా గుర్తించారు.
Similar News
News March 7, 2026
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ: డీఐజీ

రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జనవరి 1 నుంచి ఈనెల 6 వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఓవర్ స్పీడ్ 1,763 కేసులు, హెల్మెట్ లేకుండా 1,590, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 421, డ్రంక్ అండ్ డ్రైవింగ్ 1,538, ఓపెన్ డ్రింకింగ్ కేసులు 2,928 నమోదు చేసినట్లు తెలిపారు.
News March 7, 2026
అభివృద్ధి లక్ష్యాలపై కలెక్టర్ సమీక్ష

కర్నూలులోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, జిల్లా కీలక పనితీరు సూచికలపై ఆమె చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా తలసరి ఆదాయం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌డీజీ, కేపీఐ అంశాల్లో జిల్లా మరింత పురోగతి సాధించాలని ఆమె స్పష్టం చేశారు.
News March 7, 2026
అల్లు అర్జున్‌తో శిల్పా రవి

అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహ వేడుకకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవి దంపతులు అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


