News June 13, 2024
కర్నూలు: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఉద్యోగుల వినతి
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మానవతా దృక్పథంతో కొనసాగించేందుకు కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆ శాఖ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పీ.రామచంద్ర రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడలో మంత్రిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు రామచంద్రరావు తెలిపారు.
Similar News
News September 9, 2024
ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోంది: మంత్రి ఫరూక్
ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోందని నంద్యాల ఎమ్మెల్యే, మంత్రి ఫరూక్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలకు పెంచడం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, పోలవరం నిర్మాణం, పకృతి విపత్తుల సమర్ధ నిర్వహణపై దృష్టి సారించామని అన్నారు.
News September 9, 2024
జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు గ్రామీణ విద్యార్థిని ఎంపిక
కోసిగి మండలం జంపాపురానికి చెందిన అశ్విని జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైనట్లు తల్లిదండ్రులు బసవ, పార్వతీ తెలిపారు. అశ్విని కడప సైనిక్ స్కూల్లో చదువుకుంటూ ఫుట్‌బాల్ క్రీడలో కొన్నేళ్లుగా రాణిస్తోందని అన్నారు. కర్నూలు జిల్లా జట్టులో సభ్యురాలిగా ఉంటూ రాష్ట్ర జట్టులో చోటు సంపాదించిందన్నారు. ఇప్పుడు జాతీయ జట్టుకు ఎంపికవ్వడం సంతోషంగా ఉందన్నారు.
News September 9, 2024
నంద్యాల: వినాయక నిమజ్జనంలో విషాదం
ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. నలుగురు బాలురు స్వతహాగా వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకొని నిమజ్జనం చేసేందుకు తెలుగు గంగ కాలువ వద్దకు వెళ్లారు. నిమజ్జనం చేస్తుండగా అదుపుతప్పి కాలువలోకి జారిపడ్డారు. వారిలో ముగ్గురిని టోల్‌గేట్ సిబ్బంది కాపాడగా.. దస్తగిరి కుమారుడు లాల్ బాషా(12) గల్లంతయ్యాడు. పోలీసులు, గ్రామస్థులు కాల్వకట్ట వెంబడి గాలిస్తున్నారు.