News July 17, 2024

కర్నూలు: మరణంలోనూ వీడని స్నేహం

image

ఇద్దరూ స్నేహితులు మరణంలోనూ స్నేహబంధాన్ని వీడలేదు. పత్తికొండ మండలం దూదేకొండ గ్రామానికి చెందిన సురేశ్(18), మణికుమార్(19) పత్తికొండ నుంచి సొంతూరుకు బయలుదేరారు. దూదేకొండ గ్రామ సమీపంలోని సుకాలి నాగమ్మ ఆలయం వద్ద ముందు వెళుతున్న ఎద్దుల బండిని ఢీకొట్టారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుల తెలిపారు.

Similar News

News November 24, 2025

ఇళ్లు లేనివారు ఈనెల 30లోగా ఇలా చేయండి: కర్నూలు కలెక్టర్

image

PMAY–2 గ్రామీణ్ కింద అర్హతకలిగి, ఇల్లులేని గ్రామీణ ప్రజలు నవంబర్‌ 30లోపు తమపేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామాల్లో ఇంటి స్థలం ఉన్నా– లేకపోయినా సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు. ఇల్లు మంజూరు అయ్యేవారికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందజేస్తుందని పేర్కొన్నారు. గడువు తర్వాత నమోదు అవకాశంలేదని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News November 24, 2025

అర్జీలు స్వీకరించిన కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ. సిరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.