News July 17, 2024
కర్నూలు: మరణంలోనూ వీడని స్నేహం
ఇద్దరూ స్నేహితులు మరణంలోనూ స్నేహబంధాన్ని వీడలేదు. పత్తికొండ మండలం దూదేకొండ గ్రామానికి చెందిన సురేశ్(18), మణికుమార్(19) పత్తికొండ నుంచి సొంతూరుకు బయలుదేరారు. దూదేకొండ గ్రామ సమీపంలోని సుకాలి నాగమ్మ ఆలయం వద్ద ముందు వెళుతున్న ఎద్దుల బండిని ఢీకొట్టారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుల తెలిపారు.
Similar News
News December 12, 2024
ISPL: అక్షయ్ కుమార్ టీమ్‌లో కర్నూలు కుర్రాడు
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL)కు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి ఎన్నికయ్యారు. హీరో అక్షయ్ కుమార్‌కు చెందిన శ్రీనగర్ మహావీర్ టీమ్ హనుమంత్ రెడ్డిని బేస్ ప్రైజ్ రూ.3 లక్షలకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 14 వరకు ముంబైలో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 6 జట్లు పాల్గొననుండగా హైదరాబాద్ టీమ్‌ను హీరో రామ్ చరణ్ కొనుగోలు చేశారు.
News December 12, 2024
మహానందిలో భక్తజన సందడి
మహానంది ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం ఆలయ ప్రాంగణంలో వివాహాలు ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు స్థానిక రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరులలో స్నానాలు ఆచరించారు. అయ్యప్ప స్వామి దీక్ష దారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరూ సాధారణ, ప్రత్యేక, స్పర్శ దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
News December 12, 2024
నంద్యాల MP ప్రశ్న.. సమాధానం ఇచ్చిన కేంద్రం!
నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార శాఖ సమాధానం ఇచ్చింది. మహిళలను సోషల్ మీడియా వేధింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవచ్చా? అని ఎంపీ ప్రశ్నించారు. దీనికి కేంద్రం సమాచార శాఖ రిప్లై ఇచ్చింది. ‘సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సైబర్ నేరాలకు పాల్పడే వారినీ చట్టప్రకారం శిక్షించొచ్చు’ అని స్పష్టం చేసింది.