News November 16, 2024
కర్నూలు మాజీ ఎమ్మెల్యేకు YCP కీలక బాధ్యతలు
YCP సోషల్ మీడియా యాక్టివిస్టులకి అండగా నిలిచేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా పలువురు నేతలతో కూడిన బృందాలను YCP నియమించింది. YCP అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మాజీ MLA హఫీజ్ ఖాన్, ఆలూరు YCP నేత సురేందర్ రెడ్డి నియమితులయ్యారు.
Similar News
News December 12, 2024
మహానందిలో భక్తజన సందడి
మహానంది ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం ఆలయ ప్రాంగణంలో వివాహాలు ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు స్థానిక రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరులలో స్నానాలు ఆచరించారు. అయ్యప్ప స్వామి దీక్ష దారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరూ సాధారణ, ప్రత్యేక, స్పర్శ దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
News December 12, 2024
నంద్యాల MP ప్రశ్న.. సమాధానం ఇచ్చిన కేంద్రం!
నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార శాఖ సమాధానం ఇచ్చింది. మహిళలను సోషల్ మీడియా వేధింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవచ్చా? అని ఎంపీ ప్రశ్నించారు. దీనికి కేంద్రం సమాచార శాఖ రిప్లై ఇచ్చింది. ‘సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సైబర్ నేరాలకు పాల్పడే వారినీ చట్టప్రకారం శిక్షించొచ్చు’ అని స్పష్టం చేసింది.
News December 12, 2024
డోన్‌లో మెషీన్‌లో ఇరుక్కుని మహిళ మృతి
డోన్‌లోని కోట్లవారి పల్లె సమీపాన రోజు కూలికి వెళ్లే మహిళ ఫ్యాక్టరీ పల్వరైజర్ మెషీన్‌లో ఇరుక్కుని మృతి చెందింది. మృతురాలు డోన్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన లోకేశ్వరమ్మగా స్థానికులు గుర్తించారు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. మహిళ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.