News June 17, 2024
కర్నూలు: మాజీ పంచాయతీ సభ్యుడు మృతి

మద్దికేర మండల కేంద్రానికి చెందిన పంచాయతీ మాజీ వార్డు సభ్యుడు చాకలి నాగేశ్ (52) ఇవాళ మృతిచెందాడు. వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, సర్పంచ్ బండారు సుహాసిని, వైసీపీ నాయకులు, రజక సంఘం నాయకులు నివాళులర్పించారు.
Similar News
News February 22, 2026
కర్నూలు: ”సీమను’ ఎడారిని చేసేందుకు చంద్రబాబు కుట్ర’

రాయలసీమలోని ఎత్తిపోతల పథకాలను నిలిపివేసి, ప్రాంతాన్ని ఎడారిగా మార్చాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మాట్లాడారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తిరుమల వివాదం వల్ల వెంకన్న శాపంతో హెరిటేజ్ సంస్థకు రూ.2,770 కోట్ల నష్టం వాటిల్లిందని, షేర్ల విలువ భారీగా పడిపోయిందని ఆయన విమర్శించారు.
News February 22, 2026
ఆ లింకులు నమ్మకండి.. ఎస్పీ హెచ్చరిక!

ఎనిమిదో వేతన సంఘం నేపథ్యంలో “8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్” పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్ ద్వారా పంపిస్తున్న ఏపీకే(APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని, ఇటువంటి మోసాల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
News February 22, 2026
కర్నూలు జిల్లా ప్రజలకు గమనిక!

కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. ఏ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ అర్జీలు స్వీకరిస్తామన్నారు. గతంలో సమర్పించిన ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రజలు 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.


