News January 28, 2025

కర్నూలు: మార్కెట్‌లోకి Kia Syros కారు

image

SUV సెగ్మెంట్‌లో Kia Syros కారును ఎంజీ బ్రదర్స్ కియా కర్నూలు ప్రతినిధులు మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ కారు అద్భుతమైన ఫీచర్స్‌, పెట్రోల్ & డీజిల్, మాన్యువల్ & ఆటోమేటిక్ వేరియంట్లతో అందుబాటులో ఉందని సీఈఓ ఆదిత్య మాచాని తెలిపారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్, ఎస్బీఐ ఎస్ఎంఈ ఏజీఎం తారకేశ్వర్, జీఎం రత్న క్రాంతి కుమార్, జీఎం సేల్స్ శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 31, 2025

ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి: కలెక్టర్ సిరి

image

కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి గురువారం అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో 91 శాఖల అధికారులతో మూడు రోజుల పాటు జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్టాండ్ అప్ ఇండియా పథకంపై అవగాహన పెంచాలని, నాబార్డ్ ద్వారా ఆర్ఐడీఎఫ్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు.

News October 31, 2025

మ్యాట్రి’మనీ’ మోసాలపై కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

వివాహ సంబంధిత వెబ్‌సైట్లు, యాప్‌లు, సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న మ్యాట్రిమోనియల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం హెచ్చరించారు. నకిలీ పేర్లు, ఆకర్షణీయమైన ఫొటోలతో కూడిన ప్రొఫైల్స్ నమ్మి అమాయకులు మోసపోతున్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. మోసపోయిన వారు ఆన్‌లైన్ ఫిర్యాదుల కోసం www.cybercrime.gov.inలో సంప్రదించాలని ఎస్పీ సూచించారు.

News October 30, 2025

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల అందజేత

image

కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం తరఫున ప్రతినిధులు 19 మంది మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన నలుగురికి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.40 లక్షల చెక్కును అందజేశారు. ఈ చెక్కును కలెక్టరేట్‌లో మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి సమక్షంలో అందజేశారు.