News August 30, 2024
కర్నూలు: మిరపకాయల లోడు లారీ బోల్తా
పత్తికొండ నియోజకవర్గం అటికెలగుండులోని బస్టాండ్ సమీపాన కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిపై వేకువజామున బళ్లారికి ఒట్టి మిరపకాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ వేగంగా వెళ్తుండగా కుక్క అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేయడం వల్ల అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.
Similar News
News September 13, 2024
కర్నూలు జిల్లాలో రైలు మార్గం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?
కర్నూలు జిల్లాలో మొట్టమొదటి రైలు మార్గం 1870లో ప్రారంభమైంది. ముంబై, చెన్నైలను కలుపుతూ ఏర్పడిన రైలు మార్గం ఆదోని, ఆలూరు ప్రాంతాల మీదుగా 97 కి.మీ మేర ఉంటుంది. దీంతో ఎగుమతులు, దిగుమతులకు ఆదోని కేంద్రంగా మారింది. అందుకే ఈ ప్రాంతానికి రెండో బాంబేగా పేరు వచ్చిందట. 1909లో కర్నూలు-డోన్, 1930లో కర్నూల్- హైదరాబాద్‌కు రాకపోకలు ప్రారంభమయ్యాయి. 1921 SEP 29న జాతిపిత మహాత్మా గాంధీ రైలులోనే కర్నూలుకు వచ్చారు.
News September 13, 2024
మంత్రి బీసీ ఆధ్వర్యంలో 18న మెగా జాబ్ మేళా
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 18న బనగానపల్లె డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి సతీమణి బీసీ ఇందిరారెడ్డి వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు 9 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. 1,191 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసిన వారు అర్హులన్నారు.
News September 13, 2024
నగదు వసూలు చేస్తే చర్యలు: కలెక్టర్
ఆరోగ్య శ్రీ కింద పేషెంట్ల నుంచి నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రంజిత్ బాషా ఆసుపత్రి యాజమాన్యాలను అదేశించారు. గురువారం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శ్రీ కింద వస్తే ఉచితంగా చికిత్స ఇవ్వాలని, లేకపోతే అప్పుడు వారి నుంచి నగదు తీసుకునే ప్రక్రియను అన్ని ఆసుపత్రులు పాటించాలని అన్నారు.