News February 15, 2025
కర్నూలు మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు

ఏపీ టూరిజం ఆధ్వర్యంలో యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఈనెల 17న తిరుపతి, ఒంటిమిట్ట, ఓర్వకల్లు, కర్నూలు, హైదరాబాద్, బాసర, వారణాశి మీదుగా ప్రయాగ్రాజ్ చేరుకుంటుంది. తిరిగి జబల్పూర్, హైదరాబాద్, కర్నూలు, మహానంది మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఈ బస్సు 17న మ.2.15 గంటలకు కర్నూలుకు వస్తుంది. టికెట్ ధర రూ.20వేలు, పిల్లలకు రూ.17, 200లుగా నిర్ణయించారు.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకుకు కొడవండ్లపల్లి విద్యార్థి ఎంపిక

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో ముదిగుబ్బ(M) కొడవండ్లపల్లి హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని ప్రవల్లిక అండర్-17 ఖోఖోలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. HM డాక్టర్ రాశినేని రామానాయుడు, PET శాంతలింగం, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. ఈనెల 23 నుంచి విజయనగరంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రవల్లిక మరింత ప్రతిభ చూపించి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
News November 20, 2025
కొత్త సినిమాల కబుర్లు

* పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ అవుతుందని నిర్మాత రవి శంకర్ వెల్లడి.
* బాక్సాఫీస్ రారాజు వస్తున్నాడంటూ రాజాసాబ్ టీమ్ ట్వీట్. డిసెంబర్ 4న నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ప్రకటన.
* తమిళ హీరో సూర్యకు టాలీవుడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కథ చెప్పినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందని చర్చ.
News November 20, 2025
కొత్తగూడెం: 100 ఖాళీల భర్తీకి జాబ్ మేళా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగ యువకులకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరాం శుభవార్త చెప్పారు. ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్లో 100 ఖాళీల భర్తీకి ఈనెల 21న పాల్వంచ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివి, 22-28 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవాలని కోరారు. రూ.20వేల జీతంతో పాటు టీ.ఏ, ఇన్సెంటివ్స్ ఇస్తుందన్నారు.


