News October 31, 2024
కర్నూలు: ముగిసిన బీఈడీ సెమిస్టర్ పరీక్షలు
కర్నూలు రాయలసీమ వర్సిటీలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు బుధవారం నాటికి ముగిశాయి. వర్సిటీ పరిధిలోని 17 పరీక్షా కేంద్రాల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. చివరి రోజు పరీక్షకు 4,050 మంది విద్యార్థులు హాజరయ్యారు. 429 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నంద్యాల జిల్లా పరిధిలోని పరీక్షా కేంద్రాల్లో వైస్ ఛాన్సలర్ ఎన్టీకే నాయక్ పరీక్షా నిర్వహణను పరిశీలించారు.
Similar News
News October 31, 2024
స్వీయ సత్ప్రవర్తన ద్వారానే అవినీతి నిర్మూలన: కలెక్టర్
అవినీతిని అంతమొందించే ప్రక్రియ స్వీయ సత్ప్రవర్తన ద్వారానే సాధ్యమవుతుందని కలెక్టర్ జీ.రాజకుమారి ఉద్ఘాటించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వారోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.
News October 30, 2024
TTD మళ్లీ పూర్వ వైభవం సాధించాలని కోరుకుంటున్నా: MP శబరి
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నూతన ఛైర్మన్‌గా TV5 అధినేత బీఆర్ నాయుడు నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు నంద్యాల MP డా.బైరెడ్డి శబరి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నాయకత్వంలో TTD మళ్లీ పూర్వ వైభవం సాధించాలని కోరుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా MP శబరి ‘X’లో పేర్కొన్నారు.
News October 30, 2024
టీటీడీ బోర్డు సభ్యుడిగా మల్లెల రాజశేఖర్ గౌడ్
టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్‌కు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలిలో ఆయనకు సభ్యుడిగా చోటు కల్పించారు. TTD నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును నియమించగా, మరో 23 మందికి ఇందులో సభ్యులుగా అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.