News March 24, 2024
కర్నూలు: యువ ఓటర్లే కీలకం
కర్నూలు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో యువత ఓట్లే కీలక పాత్ర పోషించనున్నాయి. మొత్తం ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల లోపు వారే దాదాపు 50 శాతంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 20 నుంచి 29 ఏళ్ల లోపు వాళ్లు 6,90,703 మంది ఉండగా 30 నుంచి 39 ఏళ్ల వాళ్లు 9,63,220 మంది ఉన్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నాయకుల భవితను నిర్ణయించేందుకు వీళ్లు సిద్ధంగా ఉన్నారు.
Similar News
News November 10, 2024
వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది: ఎంపీ
వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందని ఎంపీ నాగరాజు అన్నారు. ఆదివారం కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ హైస్కూలులో జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఎంఈఓ, హెచ్ఎంలను సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యారంగం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. డీఈవో శామ్యూల్ పాల్, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
News November 10, 2024
‘మచిలీపట్నం-ధర్మవరం రైలు బెంగళూరు వరకు పొడిగించండి’
నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం రైలును బెంగళూరు వరకు పొడిగించాలని సౌత్ వెస్ట్రన్ రైల్వేను దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఈ రైలు ధర్మవరం చేరుకున్న తర్వాత 7.40 గంటల పాటు ట్రాక్‌పై ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ రైలును బెంగళూరు వరకు పొడిగించాలని అభ్యర్థించింది. SWR అంగీకారంతో ఇది సాకారం కానుంది.
News November 10, 2024
గుడిసె కృష్ణమ్మకు నిరాశ
సీఎం చంద్రబాబు ప్రకటించిన నామినేటెడ్ పదవుల రెండో విడత జాబితాలోనూ ఆదోనికి చెందిన టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మకు పదవి వరించలేదు. నామినేటెడ్ పదవి దక్కుందని భావించిన కృష్ణమ్మకు మరోసారి నిరాశే మిగిలింది. మంత్రి లోకేశ్ గతంలో చేపట్టిన యువగళం పాదయాత్రలో కృష్ణమ్మకు హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్సీ పదవి అయినా దక్కుతుందని ఆమె వర్గం ఆశిస్తోంది.