News May 18, 2024

కర్నూలు: రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్ కుమార్ తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 36.2 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24.6 డిగ్రీల నుంచి 27.4 డిగ్రీల వరకు ఉంటాయన్నారు. వర్షాలు కురవడంతో రైతులు లోతు దుక్కులు చేసుకోవాలని సూచించారు. నిన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి.

Similar News

News December 11, 2024

కలెక్టర్ల సదస్సుకు హాజరైన కర్నూలు జిల్లా కలెక్టర్

image

అమరావతిలోని సచివాలయం బ్లాక్- 2లో బుధవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో జరిగిన రెండో కలెక్టర్ల సమావేశానికి కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన సూచనలు ఆయన నమోదు చేసుకున్నారు. ఈయనతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా సదస్సుకు హాజరయ్యారు.

News December 11, 2024

భూమా దంపతులు ఉంటే ఇలా మాట్లాడేవారా?: మంచు మనోజ్

image

భూమా మౌనికకు తల్లిదండ్రులు ఉంటే తన తండ్రి ఇలా ప్రవర్తించే వారా? అని మంచు మనోజ్ ప్రశ్నించారు. ‘భూమా మౌనికను ప్రేమించా. పెళ్లి చేసుకున్నా. అందులో తప్పేముంది. నా భార్య వచ్చాక చెడ్డోడిని అయ్యానంటున్నారు. తాగుడికి బానిసయ్యానని మాట్లాడుతున్నారు. మౌనికకు తల్లిదండ్రులు ఉంటే ఇలా మాట్లాడేవారా. ఇప్పుడు ఆమెకు తల్లీ, తండ్రి అన్నీ నేనే. నా భార్య కష్టపడే వ్యక్తి. నిజాలు తర్వలో తెలుస్తాయి’ అని చెప్పారు.

News December 11, 2024

అన్నదాతకు అండగా ఉద్యమిస్తాం: కాటసాని

image

అన్నదాతలకు అండగా నిలబడి ఉద్యమిస్తామని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలులోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ డిసెంబరు 13న రైతుల కోసం.. రైతులతో కలిసి నంద్యాలలోని ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు.