News May 12, 2024

కర్నూలు: రాబోయే 5 రోజుల్లో పిడుగులతో కూడిన వర్షం

image

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రాబోయే 5 రోజుల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఎవరూ ఉండకూడదని తెలిపారు.

Similar News

News February 7, 2025

మీ పిల్లల టాలెంట్‌ని అందరికీ చెప్పాలనుకుంటున్నారా

image

డ్యాన్స్, సింగింగ్, డ్రాయింగ్, స్పీచ్ ఇలా ఏదైనా మీ పిల్లల్లో ప్రతిభ ఉంటే 5 నిమిషాలు మించకుండా వీడియో తీసి తప్పకుండా ఎడిట్ చేయండి. పిల్లల పేరు, తరగతి, గ్రామం వివరాలతో.. 97036 22022 నంబరుకు వాట్సప్ చేయండి. Way2News ఎంపిక చేసిన ఉత్తమ వీడియోను ప్రతి ఆదివారం సా.6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
➤ ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో వచ్చిన వీడియోలనే పరిగణిస్తాం.
➤ 15 ఏళ్ల లోపు పిల్లల వీడియోలే తీసుకుంటాం.

News February 6, 2025

ఓర్వకల్లు దగ్గర ప్రమాదం.. ఇద్దరు మృతి

image

కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు వద్ద ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మృతులు జానకి(60), విహారిక(4)గా గుర్తించారు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి రాయచూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 6, 2025

TG భరత్‌కు 15వ ర్యాంకు

image

మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గత డిసెంబర్ వరకు ఫైళ్లను త్వరగా క్లియర్ చేసిన వారికి మెరుగైన ర్యాంకు లభించింది. ఈక్రమంలో కర్నూలుకు చెందిన మంత్రి టీజీ భరత్‌‌కు 15వ ర్యాంకు లభించింది. నంద్యాలకు చెందిన ఫరూక్‌కు మొదటి ర్యాంకు, బనగానపల్లెకు చెందిన బీసీ జనార్దన్ రెడ్డి 9వ ర్యాంకు లభించింది.

error: Content is protected !!