News April 12, 2025
కర్నూలు: రాష్ట్ర స్థాయిలో KGBV విద్యార్థినుల సత్తా

AP ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించిన సీనియర్ ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో కర్నూలు జిల్లా పంచలింగాల KGBVకి చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో మొదటి 3 ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ స్వప్న కుమారి తెలిపారు. మొదటి ర్యాంకులో టీ.మానస 992/1000, 2వ ర్యాంకులో యు. మానస 992/1000, 3వ ర్యాంకులో టీ. సుజాత 981/1000 మార్కులతో నిలిచారు.
Similar News
News April 11, 2026
ఆదోని ఎమ్మెల్యే చుట్టూ వివాదం.. పోస్టర్లు వైరల్

ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లు హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ నేత సౌదీ రావుఫ్ రూ.10 లక్షల లంచం నిజమేనని, ఈ పోస్టర్ల ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
News April 10, 2026
చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించండి: కలెక్టర్

కర్నూలు నగర శివారులోని గార్గేయపురం డంపింగ్ యార్డ్‌ను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సందర్శించారు. నగర కమిషనర్ విశ్వనాథ్, ఆర్డీవోతో కలిసి చెత్తను శాస్త్రీయ విధానంలో డీకంపోజ్ చేసే ప్రక్రియను పరిశీలించారు. యార్డ్‌లో అమలవుతున్న నిర్వహణ పద్ధతులను అధికారులతో సమీక్షించారు. మరింత మెరుగైన చర్యలు చేపట్టాలని సూచించారు. చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు.
News April 9, 2026
పోషణ పక్వాడ కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్ సిరి

కర్నూలు జిల్లాలో ఈనెల 9 నుంచి 23 వరకు జరగనున్న పోషణ పక్వాడ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పోషణ పక్వాడ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. 2 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్, టీవీ స్క్రీన్‌లను పూర్తిగా దూరం పెట్టాలని సూచించారు. జంక్ ఫుడ్స్‌కు బదులుగా పప్పులు, పల్లీలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.


