News November 19, 2024
కర్నూలు: ‘రూ.100 కోసం ప్రాణం తీశాడు’

రూ.100 కోసం వ్యక్తిని చంపిన ఘటన కర్నూలులో సోమవారం జరిగింది. పోలీసుల వివరాలు.. మమతానగర్‌కు చెందిన కృపానందం(27), రోజావీధికి చెందిన అజీజ్ ఇద్దరూ కల్లు తాగేచోట ఫ్రెండ్స్ అయ్యారు. సోమవారం కల్లు తాగి సంకల్‌బాగ్‌లోని ఓస్కూలు వద్ద బొమ్మ, బొరుసు ఆట ఆడారు. కృపానందం రూ.100 గెలుచుకోవడంతో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అజీజ్ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కృపానందం తలపై అజీజ్ రాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
Similar News
News March 16, 2026
పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: DEO

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చీఫ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ఆదేశించారు. సోమవారం డీఈవో కార్యాలయం నుంచి నిర్వహించిన కమాండ్ కంట్రోల్ సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఏవైనా అసౌకర్యాలు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరీక్షల విభాగపు అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్ పాల్గొన్నారు.
News March 15, 2026
కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా డిస్కౌంట్లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు లేదా OTPలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు.
News March 15, 2026
ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యం: కలెక్టర్

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. ఆదివారం కర్నూలులోని శ్రీరామ్ నగర్‌లో ఉన్న నగర పాలక ప్రాథమిక పాఠశాలలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అభ్యాసకులకు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలని కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.


