News September 17, 2024

కర్నూలు: రూ.2 లక్షలు పలికిన మహాగణపతి లడ్డూ

image

కర్నూలు పాత నగరంలోని తుంగభద్ర నదీ తీరాన కొలువుదీరిన 63 అడుగుల మహాగణపతి విగ్రహం వద్ద జరిగిన లడ్డూ వేలం పాటలో కాంచనం సురేశ్ బాబు (స్వస్తిక్ డెవలపర్స్) రూ.2 లక్షలకు దక్కించుకున్నారు. నగరానికి చెందిన చింటూ, భరత్, వికాస్ స్వామివారి హుండీని రూ.1,45,000కు పాట పాడి దక్కించుకున్నారు.

Similar News

News December 7, 2025

ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది: డీఈవో

image

పదో తరగతి ఫలితాల కోసం ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించి, పాఠాలు పూర్తిగా నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. ప్రతీ పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.

News December 7, 2025

ట్రేడర్లు ఎంఎస్‌పీ కన్నా తక్కువకు కొనరాదు: కలెక్టర్

image

రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా మొక్కజొన్నను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 తగ్గకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి ట్రేడర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తూకాలలో లోపాలు, మోసాలు జరగకుండా పరిశీలనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రవాణా ఛార్జీలు అధికంగా ఉండటం వల్ల కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చర్యలు చేపట్టామన్నారు.