News January 13, 2026
కర్నూలు: ‘రూ.8 వేలతో కొంటాం’

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలో నాఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటి ద్వారా క్వింటాకు రూ.8,000 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఆర్.జయలక్ష్మి తెలిపారు. కంది పంట నమోదు చేసిన ఈ-క్రాప్ సర్టిఫికెట్‌తో పాటు తేమ శాతం పరీక్షకు కందుల శాంపిల్ తీసుకొని రావాలని రైతులను సూచించారు.
Similar News
News February 13, 2026
పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: సీఎస్

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆర్ఐవోలు పాల్గొన్నారు.
News February 12, 2026
అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 5వ తరగతి, 6వ నుంచి 10వ తరగతి మిగులు సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరం (ఆంగ్ల మాధ్యమం) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఎంఈ గీతా తెలిపారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. అభ్యర్థులు https://apbragcet.apcfss.in వెబ్‌సైట్‌లో ఈనెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 12, 2026
మహాశివరాత్రి వేళ.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదన్నారు. OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు.


