News April 5, 2024
కర్నూలు: రేపటి నుంచి ఎస్ఏ-2 పరీక్షలు
కర్నూలు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు శనివారం నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ)-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.శామ్యూల్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. స్కూల్ కాంప్లెక్స్ నుంచే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశ్న పత్రాలను తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.
Similar News
News January 20, 2025
ప్రేమ పేరుతో లెక్చరర్ మోసం.. ఆదోని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు
తనను ప్రేమ పేరుతో నమ్మించి ఓ లెక్చరర్ మోసం చేశాడని ఓ యువతి సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కౌతాళం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఆయన 2023-24 సంవత్సరంలో ప్రేమిస్తున్నారని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని తెలిపారు. అప్పటి నుంచి ఇరువురం ప్రేమలో ఉన్నామని పేర్కొన్నారు. తాజాగా ఇష్టం లేదంటూ పెళ్లికి నిరాకరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.
News January 20, 2025
కొత్తపల్లి: బయల్పడుతున్న సంగమేశ్వరాలయం
కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సప్త నదుల సంఘం క్షేత్రంలోని సంగమేశ్వరాలయం నెమ్మదిగా బయలు పడుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 855.90 అడుగుల మేర నీటి నిల్వలు ఉండడంతో ఆలయం పది అడుగుల మేర బయల్పడింది. మరో 18 అడుగులు తగ్గినట్లయితే ఆలయం పూర్తిస్థాయిలో బయలు పడనుంది. జులై నెలలో నీటి మునిగిన సంగమేశ్వరుడు నెమ్మదిగా జలాధివాసం నుంచి విముక్తి పొందుతున్నారు.
News January 20, 2025
బేతంచెర్ల మండలంలో మహిళ ఆత్మహత్య
బేతంచెర్ల మండలం గొర్లగుట్ట గ్రామానికి చెందిన బోయ నాగలక్ష్మి(39) కడుపు నొప్పి తాళలేక పేడ రంగు నీళ్లు తాగి ఆత్మహత్య చేసుకుందని హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర గౌడ్ ఆదివారం తెలిపారు. కొంతకాలంగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉండేదని, వైద్యం చేయించినా నయం కాలేదన్నారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడ రంగు నీళ్లు తాగి ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.