News June 2, 2024

కర్నూలు: రేపు, ఎల్లుండి మద్యం అమ్మకాలు బంద్

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ 4న జరగనున్న నేపథ్యంలో 3, 4వ తేదీల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ డాక్టర్ సృజన ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కేవలం 4వ తేదీ మాత్రమే మూసివేయాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు మూసివేయాలని ఆదేశిస్తూ కలెక్టర్ మరో ఉత్తర్వు జారీ చేశారు.

Similar News

News September 8, 2024

వ‌ర‌ద‌ బాధితుల స‌హాయార్ధం రూ.కోటి విలువైన 10 వేల కిట్లు సిద్ధం

image

విజ‌య‌వాడ వ‌ర‌ద బాధితుల‌కు కోసం రూ.కోటి విలువైన 10 వేల నిత్యావసర సరుకుల కిట్లు సిద్ధం చేసిన‌ట్లు మంత్రి టీజీ భ‌ర‌త్, టీడీపీ క‌ర్నూలు జిల్లా అధ్య‌క్షుడు తిక్కారెడ్డి తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జులు, నాయ‌కుల స‌హ‌కారంతో వీటిని తయారు చేసిన‌ట్లు చెప్పారు. ఒక్కో కిట్‌లో 5 కేజీల బియ్యం, కేజీ కందిప‌ప్పు, కేజీ చక్కెర‌, ఉప్మార‌వ్వ‌, కారంపొడి, త‌దిత‌ర వ‌స్తువులు ఉన్నాయన్నారు.

News September 8, 2024

ప్రణాళికలతో నిమజ్జన ఏర్పాట్లను చేయండి: ఎస్పీ

image

కర్నూలులో ఈనెల 15న జరగబోయే వినాయక నిమజ్జన మహోత్సవాన్ని అధికారులు ప్రణాళికలతో ఏర్పాటు చేయాలని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. ఆదివారం రాంబోట్ల దేవాలయం, బాదం మాస్క్ మీదుగా, కింగ్ మార్కెట్, కొండారెడ్డి బురుజు మీదుగా అంబేడ్కర్ సర్కిల్, రాజ్ విహార్ మీదుగా వెళ్లే వినాయక విగ్రహాల ఊరేగింపు ప్రాంతాలను పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.

News September 8, 2024

డోన్: చవితి వేడుకల్లో అపశ్రుతి..యువకుడి మృతి

image

డోన్ పట్టణంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామా నగర్‌కు చెందిన కమ్మరి కౌశిక్ శనివారం రాత్రి గణేశ్ మండపానికి ప్లాస్టిక్ కవర్ కప్పబోయి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తోటి వారు డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మరణించినట్లు తెలిపారు. దీంతో పండగ పూట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.