News July 21, 2024
కర్నూలు: రైతు బలవన్మరణం

ఎమ్మిగనూరు మండలం కే.తిమ్మాపురానికి చెందిన రైతు రంగన్న(39) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం రాత్రి తన సొంత పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గ్రామస్థులు గమనించి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. రంగన్న 2 ఎకరాలు సొంత భూమితో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు.
Similar News
News January 3, 2026
కర్నూలు జిల్లాలో 78 ఉద్యోగాలకు నోటిఫికేషన్

కర్నూలు జిల్లాలోని KGBVల్లో 78 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 56, టైప్-4 కేజీబీవీల్లో 22 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: నేటి నుంచి జనవరి 11 వరకు
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.
News January 3, 2026
జాతీయ ఆర్చరీలో కర్నూలుకు స్వర్ణ కాంతులు

హైదరాబాద్లో జరిగిన 5వ జాతీయ స్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో కర్నూలు క్రీడాకారులు సత్తా చాటారు. ఏపీ జట్టు తరఫున పాల్గొన్న 30 మంది క్రీడాకారులు 7 బంగారు, 6 వెండి, 10 కాంస్య పతకాలు సాధించారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించడం గొప్ప విషయమని, అందులో కర్నూలు క్రీడాకారులు ఉండటం గర్వకారణమని డీఐజీ/కర్నూలు ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. క్రీడాకారులను ఆయన అభినందించారు.
News January 3, 2026
పరిశ్రమల అనుమతులకు వేగం పెంచాలి: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి అనుమతులను పెండింగ్ లేకుండా త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి అనుమతులు ఇవ్వాలన్నారు. ఎంఓయూ చేసుకున్న పరిశ్రమల ఏర్పాటు కోసం చర్యలు వేగవంతం చేయాలన్నారు.


