News December 26, 2024
కర్నూలు: రైలు నుంచి పడిపోయిన యువతి
కర్నూలు జిల్లా యువతి రైలు నుంచి జారిపడిపోయింది. దేవనకొండ(M) కరివేములకు చెందిన హరిత తమ్ముడితో కలిసి గుత్తికి రైల్లో బయల్దేరింది. మార్గమధ్యలో బాత్‌రూముకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తమ్ముడు ధర్మవరం పోలీసులకు సమాచారం అందించాడు. హరిత ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.
Similar News
News December 28, 2024
అటవీ సంపదను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్ జి.రాజకుమారి
అటవీ సంపదను సంరక్షించుకుంటూ వన్యప్రాణులను కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పచ్చర్ల ఎకో టూరిజం క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అధి రాజ్ సింగ్ రాణాతో కలిసి జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూముల్లో బోర్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్నారు.
News December 27, 2024
వైసీపీకి ఇంతియాజ్ రాజీనామా
విశ్రాంత ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మంత్రి టీజీ భరత్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్న ఇంతియాజ్ తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
News December 27, 2024
కర్నూలు: 58వ సారి రక్తదానం
కర్నూలులోని ఓ ఆసుపత్రిలో హనుమంతు అనే వ్యక్తికి గుండె ఆపరేషన్ చేశారు. ఈక్రమంలో రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సొసైటీని సంప్రదించారు. ఆ సొసైటీ అధ్యక్షుడు గందాలం మణికుమార్ స్పందించారు. 58వ సారి ఆయన రక్తదానం చేశారు. ఈ మేరకు ప్రశంసా పత్రాన్ని అందించారు.