News April 28, 2024

కర్నూలు: రైలు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

రైలు ప్రమాదంలో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న ఆదోని ఆర్ఎస్ యార్డు కిమీ 494/3-1 వ‌ద్ద శ‌నివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ కే.గోపాల్ తెలిపిన వివ‌రాల‌ మేర‌కు.. మృతుని వ‌ద్ద ఎలాంటి ఆధారాలు ల‌భ్యం కాలేద‌న్నారు. ఎడ‌మ చేతిపై మామ్‌, డాడ్ అని ప‌చ్చ‌బోట్లు ఉన్నాయ‌ని, మెడ‌లో శ్రీఆంజ‌నేయ‌ స్వామి డాల‌ర్ చైన్ ఉంద‌ని తెలపారు. ఎవరైనా గుర్తిస్తే స‌మాచారం అందించాల‌ని కోరారు.

Similar News

News November 3, 2024

4న కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమం: కలెక్టర్

image

ఈనెల 4వ తేదీన (సోమవారం) కర్నూలు కలెక్టరేట్లో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని రెవెన్యూ, మున్సిపల్, మండల కార్యాలయాల్లో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా కార్యాలయాల్లో అధికారులు తప్పక పాల్గొని ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు.

News November 3, 2024

కొలిమిగుండ్ల పరిధిలో క్రషర్‌లో పడి యువకుడి మృతి 

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల పరిధిలోని ఓ పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు క్రషర్‌లో పడి ఓ యువకుడు మరణించాడు. అందిన వివరాల మేరకు.. మృతుడు సురేశ్ ఆచారి (25) మెకానికల్ హెల్పర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 3, 2024

జగన్ హయాంలోనే యురేనియం పరిశీలనకు అనుమతులు: తిక్కారెడ్డి

image

కప్పట్రాళ్ల అడవుల్లో యురేనియం తవ్వకాలపై నిరసన వ్యక్తం అవుతుండటంపై జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారెడ్డి స్పందించారు. జగన్ హయాంలోనే యురేనియం పరిశీలనకు అనుమతులిచ్చారని తెలిపారు. నేడు ఆలూరు వైసీపీ నాయకులు రోడ్లెక్కి సీఎం చంద్రబాబుపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నేతల ప్రవర్తన మారలేదని ఆయన విమర్శించారు.