News March 19, 2025
కర్నూలు: లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..!

ఆస్పరి SI వెంకట నరసింహులు సస్పెన్షన్‌కు గురయ్యారు. చిత్తూరు జిల్లా సోమల పీఎస్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ నుంచి లంచం తీసుకున్న ఘటనలో సస్పెండ్ చేశారు. 2023లో ఓ మహిళ అదృశ్యమవ్వడంతో భర్త ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆమె స్టేషన్‌కు చేరుకుని తన భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. అందుకు ఎస్ఐ రూ.లక్ష డిమాండ్ చేసి, మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టించాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.
Similar News
News January 5, 2026
రౌడీషీటర్లకు కర్నూలు జిల్లా పోలీసుల కౌన్సెలింగ్

జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది. సత్ప్రవర్తనతో జీవించాలని, నేరాలకు దూరంగా ఉండాలని సూచించిన పోలీసులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News January 4, 2026
కర్నూలులో కడుపుబ్బా నవ్వించిన జబర్దస్త్ టీమ్

కర్నూలులో జబర్దస్త్ టీమ్ కడుపుబ్బ నవ్వించారు. ఆదివారం టీజీవి కళాక్షేత్రంలో 2026 సంవత్సరం మొదటి ప్రదర్శనగా జబర్దస్త్ కామెడీ షోను ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి, విద్యావేత్తలు కేవీఎన్ రాజశేఖర్, పుల్లయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంవత్సరం మొత్తం శ్రోతలకు ఆనందం, వినోదం అందించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.
News January 4, 2026
దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది: మంత్రి

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం లూయిస్ బ్రెయిలీ 217వ జయంతిని పురస్కరించుకుని కర్నూల్లోని బి.క్యాంపులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇంద్రధనస్సు లాంటి 7 వరాలను ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగుల కోసం ప్రకటించారన్నారు.


