News March 19, 2025
కర్నూలు: లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..!

ఆస్పరి SI వెంకట నరసింహులు సస్పెన్షన్కు గురయ్యారు. చిత్తూరు జిల్లా సోమల పీఎస్లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ నుంచి లంచం తీసుకున్న ఘటనలో సస్పెండ్ చేశారు. 2023లో ఓ మహిళ అదృశ్యమవ్వడంతో భర్త ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆమె స్టేషన్కు చేరుకుని తన భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. అందుకు ఎస్ఐ రూ.లక్ష డిమాండ్ చేసి, మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టించాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.
Similar News
News October 26, 2025
నిడిగొండ త్రికూట ఆలయాన్ని సందర్శించిన హెరిటేజ్ బృందం

రఘునాథపల్లి మండలం నిడిగొండలోని త్రికూట ఆలయాన్ని ‘హైదరాబాద్ హెరిటేజ్ వాక్’ మిత్ర బృందం సభ్యులు ఆదివారం సందర్శించారు. స్థానిక శివాలయం, ఇతర చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను ఆలయ పూజారి కృష్ణమాచార్యులు వారికి వివరించారు. అంతకుముందు జనగామ మండలం పెంబర్తిలోని హస్త కళలను సందర్శించి, అక్కడ వర్క్షాపు నిర్వహించారు.
News October 26, 2025
సిరిసిల్ల: రేపటి ప్రజావాణి రద్దు

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రేపు (అక్టోబర్ 27) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించిన లక్కీ డ్రా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News October 26, 2025
కృష్ణ: గుట్టు చప్పుడు కాకుండా మాయం

కృష్ణ మండలం గుడెబల్లూర్ తిమ్మప్ప స్వామికి దీపం వెలిగించే గుట్టలో కొన్ని రోజులుగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బ్లాస్టింగ్ చేసి అక్రమంగా రాయిని తరలిస్తున్నారు. సహజ సంపద ఇలా అక్రమంగా తరలిస్తుంటే అధికారులకు తెలియకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్టను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.


