News August 28, 2024

కర్నూలు: వచ్చే నెల 2న కౌన్సెలింగ్

image

కర్నూలు వైద్య కళాశాలలోని ఆడిటోరియంలో పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు సెప్టెంబరు 2న కౌన్సెలింగ్ ఉంటుందని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్ మంగళవారం తెలిపారు. అభ్యర్థులు తమ అర్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు. బైపీసీ వారికి మొదటి ప్రాధాన్యమిస్తామని పేర్కొ న్నారు. మార్కులు, రోస్టర్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు.

Similar News

News December 18, 2025

కలెక్టర్ల సదస్సులో సిరి, ఎస్పీ

image

రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కొనసాగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సదస్సులో కర్నూలు జిల్లా నుంచి కలెక్టర్ డా. ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న పరిపాలనా కార్యక్రమాలు, శాంతిభద్రతల అంశాలపై చర్చించారు. జిల్లాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

News December 18, 2025

సీఎం చంద్రబాబుకు అవార్డు ఏపీకి గర్వకారణం: మంత్రి టీజీ

image

సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి టీజీ భరత్. ఈ అవార్డు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘దార్శనికత విశ్వాసాన్ని సృష్టిస్తుంది. విశ్వాసం పెట్టుబడులను ఆకర్షిస్తుంది. పెట్టుబడి ఉద్యోగాలను సృష్టిస్తుంది’ అంటూ భరత్ ట్వీట్ చేశారు. ఏపీకి ఇది గర్వకారణమైన క్షణం అన్నారు. సీఎం చంద్రబాబు బలమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు.

News December 18, 2025

ప్రతి పాఠశాలలో వారం రోజులు వేడుకలు: డీఈవో

image

కర్నూలు జిల్లాలో ఈనెల 18 నుంచి 24 వరకు అన్ని ఉన్నత పాఠశాలల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.సుధాకర్ తెలిపారు.19న ఏపీజే అబ్దుల్ కలాం మునిసిపల్ హైస్కూల్‌లో 8, 9వ తరగతి విద్యార్థులకు డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీలు జరగనున్నాయి. విజేతలకు రూ.5 వేల వరకు బహుమతులు అందజేస్తారు.