News March 21, 2024
కర్నూలు: వరుసగా 5సార్లు MLA.. 3సార్లు ఓటమి

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీవీ మోహన్ రెడ్డిది ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. నియోజకర్గంలో 8సార్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అందులో 1983 నుంచి 1999 వరకు వరుసగా 5సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి 2012 వరకు వరుసగా చెన్నకేశ్వరెడ్డి చేతిలో 3సార్లు ఓటమిపాలయ్యారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర గౌడ్‌పై 28904 అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రికార్డు ఉంది.
Similar News
News April 3, 2025
నేడు కర్నూలుకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు కర్నూలుకు రానున్నారు. ఉ.9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.30 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం నగర శివారులోని జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైసీపీ నేత కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. మ.12.50 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు.
News April 3, 2025
సుంకేసుల డ్యామ్ ఘటన.. మృతులు వీరే!

కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్ వద్ద నిన్న విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన సులేమాన్ (47) తన కుమార్తెకు పదో తరగతి పరీక్షలు ముగియడంతో కుటుంబ సభ్యులతో కలిసి డ్యామ్ వద్దకు వెళ్లారు. తన కుమారులు ఫర్హాన్ (13), ఫైజాన్ (9)తో కలిసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. కాసేపటి తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి. ఘటనపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 3, 2025
కర్నూలు-విజయవాడ విమాన సర్వీసులపై చర్చ

కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారని భరత్ తెలిపారు.