News March 5, 2025

కర్నూలు: వలస కూలీల కొడుకు SIగా ఎంపిక

image

నందవరం మండలం మిట్టసాంపురానికి చెందిన శ్యామరావు, సువర్ణమ్మ దంపతుల రెండో కుమారుడు మారెప్ప తన తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అనంతపురంలో ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్న ఆయనకు చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు వలస కూలీలు కాగా.. తమ కష్టానికి తగిన ప్రతిఫలం నేటికి దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్థులు మారెప్పను అభినందించారు.

Similar News

News December 4, 2025

పుతిన్ పర్యటన ప్రతి అడుగులో ‘FSO’ నిఘా

image

అత్యంత పటిష్ఠ భద్రత మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సాగుతోంది. విదేశీ ప్రముఖుల భద్రతను ఆతిథ్య దేశాలే సహజంగా పర్యవేక్షిస్తుంటాయి. పుతిన్ పర్యటనను మాత్రం రష్యాలోని రహస్య సంస్థ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ చూస్తుంది. ఆయన ఉండే భవనం, తీసుకొనే ఆహారం సహా ప్రతి అడుగులో పలు జాగ్రత్తలు తీసుకుంటారని మాజీ బాడీగార్డు ఒకరు తెలిపారు. పుతిన్ తినే ఫుడ్‌ను ఫస్ట్ ఓ బాడీగార్డ్ టేస్ట్ చేస్తారని చెప్పారు.

News December 4, 2025

కేంద్ర బిల్లుతో గుట్కా వినియోగం తగ్గుతుంది: ఎంపీ ఉదయ్

image

దేశ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు, వైద్య సేవలు అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన బిల్లును కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సమర్థించారు. గురువారం పార్లమెంట్‌లో బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లు వల్ల గుట్కా, పాన్‌ మసాలా వంటి వాటి వినియోగం తగ్గుతుందని, తద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని వివరించారు. అందుకే ఈ బిల్లుకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు.

News December 4, 2025

యూ.కొత్తపల్లి: ‘టీచర్లపై కుల దూషణ ఆరోపణలు అవాస్తవం’

image

ఉపాధ్యాయులపై వచ్చిన కుల దూషణ ఆరోపణలు అవాస్తవమని యూ.కొత్తపల్లి మండలం యండపల్లి పాఠశాల విద్యార్థులు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ షాన్‌మోహన్‌ను కలిసిన విద్యార్థులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. పాఠశాలలో ఎలాంటి కుల దూషణ జరగలేదని చెప్పారు. బదిలీ చేసిన ఉపాధ్యాయులను తిరిగి తమ పాఠశాలకు పంపించాలని వారు కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.